

యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో చిన్న వయసులోనే అవకాశాన్ని అందుకుని సత్తా చాటుతున్న వైభవ్.. కొన్ని మ్యాచ్‌లు లేదా ఒక సిరీస్‌కే పరిమితమైన ఆటగాడిగా కాకుండా సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. వైభవ్ పురోగతి, భవిష్యత్తుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టిందని సైకియా వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే అంశాన్ని భారత జట్టు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రపంచకప్‌కు సన్నాహకంగా 4 నుంచి 6 వన్డేల సిరీస్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, బీసీసీఐ రివ్యూ మీటింగ్‌లో ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా ప్రధాన అంశంగా చర్చకు వచ్చింది. భవిష్యత్ సిరీస్‌లు, ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిట్‌నెస్ విషయంలో బోర్డు కఠిన వైఖరిని కొనసాగించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!