
క్రీడలు

కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తమ తదుపరి రాజకీయ అడుగుపై రెండు ప్రధాన పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు రాత్రిలోపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు సీట్లు ఇచ్చే పార్టీలో చేరేందుకు సురేఖ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, కొండా కుటుంబం ప్రాంతీయ పార్టీ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
తదుపరి రాజకీయ నిర్ణయంపై కొండా దంపతులు తమకు అందుతున్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలో చేరే అవకాశాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. చర్చలు పూర్తయిన తర్వాతే వారి తుది నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాత్రిలోపు కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!