

యంగ్ హీరో సుహాస్, కోలీవుడ్ స్టార్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుహాస్ షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను వెల్లడించారు. దాదాపు 70 రోజుల పాటు సముద్రంలోనే షూటింగ్ చేశామని, ప్రతిరోజూ ఒడ్డు నుంచి 10 నుంచి 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లి సాయంత్రం వరకు అలల మధ్యే ఉండాల్సి వచ్చేదని తెలిపారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు.
షూటింగ్ సమయంలో పలుమార్లు చావుకు చాలా దగ్గరగా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డానని సుహాస్ వెల్లడించారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదని, ప్రస్తుతం మంచి అవకాశాలు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమాలో తాను సీరియస్‌గా భయపెట్టే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. రామేశ్వరం సమీపంలోని రామనాథపురం నేపథ్యంలో సాగే ఈ కథలో బోటు రేసింగ్ ప్రధాన అంశంగా ఉంటుంది. రేసులో ముందుండే కెప్టెన్‌ను ‘మండాడి’ అని పిలుస్తారని, అందుకే సినిమాకు ఆ పేరు పెట్టినట్లు సుహాస్ వివరించారు. సత్యరాజ్, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!