

జుక్కల్ ఎక్స్ రోడ్ దాటి బిచ్కుంద సమీపంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్-1 డిపోకు చెందిన TS34Z0030 ఎక్స్‌ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంలో బస్సు డ్రైవర్ అంజనేయులు బస్సు కింద చిక్కుకుని మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. కొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!