

చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సంచలన విజయంతో క్వార్టర్‌ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 35వ స్థానంలో ఉన్న శ్రీకాంత్.. 9వ ర్యాంకర్ విక్టర్ లాయ్‌ను 21-18, 21-19తో ఓడించాడు. 33 ఏళ్ల శ్రీకాంత్ గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనుకబడినప్పటికీ, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరి పునరాగమన సంకేతాలు ఇచ్చాడు. చైనా మాస్టర్స్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ టైటిల్‌పై కన్నేశాడు.
విజయం అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. స్కోరుపై కాకుండా తన ఆటతీరుపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. క్వార్టర్స్‌లో హాంకాంగ్‌కు చెందిన లీ చియక్‌తో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ కూడా క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో-టోమా పొపోవ్ జోడీని 21-15, 22-24, 21-9తో ఓడించింది. మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ 17-21, 21-18, 16-21తో జపాన్ క్రీడాకారిణి టొమాకా మియాజకి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!