

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రనబలి’, ‘రౌడీ జనార్దన’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘రనబలి’ దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ‘రౌడీ జనార్దన’ విడుదల విషయంలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. 2027 సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘రనబలి’ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత విజయ్ ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నారు. గోదావరి ప్రాంతం నేపథ్యంలో కథ సాగనున్నట్లు సమాచారం. గ్రామీణ వాతావరణం, మాస్ అంశాలు, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీ, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!