

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ జోడీ ‘బేబీ’ సినిమాతో సంచలనం సృష్టించింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆ చిత్రం ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ జోడీ ‘ఎపిక్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు విడుదలైన ప్రచార కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో హైప్‌ను తీసుకురాలేకపోయింది. ట్రైలర్, పాటలు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ప్రస్తుతం సినిమాపై బజ్ కాస్త తక్కువగానే కనిపిస్తోంది.
అయితే ‘ఎపిక్’కు దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రధాన బలంగా నిలుస్తున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘#90s’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. సహజమైన పాత్రలు, భావోద్వేగ కథనాలను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘బేబీ’లో వైష్ణవి-ఆనంద్ కెమిస్ట్రీ సినిమాకు బలంగా నిలిచింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ‘ఎపిక్’లో ఆదిత్య హాసన్ మరోసారి పునరావృతం చేసి, సినిమాను విజయవంతం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!