
క్రీడలు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నేతగా మెలోనీ రికార్డు సాధించిన నేపథ్యంలో ఆమెకు అభినందనలు తెలియజేశారు. మెలోనీ నాయకత్వంలో సాధించిన ఈ రాజకీయ మైలురాయి ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్-ఇటలీ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత విస్తరించి, ద్వైపాక్షిక సంబంధాలు కొత్త స్థాయికి చేరుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!