

ఆసియా క్రీడల స్వర్ణ పతక పోరులో పాకిస్థాన్‌తో తలపడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. సైమ్ ఆయుబ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించగా బంతి బ్యాట్ అంచును తాకి వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ చేతుల్లోకి వెళ్లడంతో వైభవ్ ఔటయ్యాడు. అతడు పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో ఆయుబ్ పిల్లలతో ఆడుతున్నట్టుగా సైగలు చేస్తూ సెండాఫ్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఆయుబ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ రెండు బౌండరీలు, ఒక సిక్సర్ బాదుతూ గట్టిగా బదులిచ్చాడు. ఆయుబ్ తన నాలుగు ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో శివమ్ దూబే రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదగా, తిలక్ వర్మ కూడా ఒక బౌండరీ కొట్టాడు. దీంతో వైభవ్ వికెట్ మినహా ఆయుబ్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!