

బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతున్న వేళ హోస్ట్ అక్కినేని నాగార్జున రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సీజన్ 3 నుంచి బిగ్‌బాస్ తెలుగు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున.. సీజన్ సీజన్‌కు తన పారితోషికాన్ని పెంచుకుంటూ వచ్చారనే వార్తలు ఉన్నాయి. గత సీజన్‌కు ఆయన రూ.30–35 కోట్ల వరకు అందుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా సీజన్ 10 కోసం రూ.35–40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ మొత్తంపై షో నిర్వాహకులు లేదా నాగార్జున నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
‘బిగ్‌బాస్ 10 దశావతారం’ ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ మా, జియో హాట్‌స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వారాంతాల్లో శని, ఆదివారాల్లో నాగార్జున షోకు హాజరై ఆ వారం జరిగిన పరిణామాలను సమీక్షించనున్నారు. ప్రచారంలో ఉన్న రూ.35–40 కోట్ల రెమ్యునరేషన్ నిజమైతే, ఒక్కో ఎపిసోడ్‌కు ఆయనకు భారీ మొత్తమే దక్కనున్నట్లు లెక్క. మరోవైపు నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!