

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 10 పదేళ్ల సెలబ్రేషన్స్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైంది. రాత్రి 7 గంటలకు మొదలైన ఈ మైలురాయి సీజన్ ప్రారంభ వేడుకల్లో గత 9 సీజన్లకు సంబంధించిన మధుర జ్ఞాపకాలు, ఎమోషనల్ మూమెంట్స్, సెలబ్రేషన్స్, విజేతల విన్నింగ్ మూమెంట్స్‌ను మరోసారి గుర్తు చేశారు. ‘బిగ్‌బాస్ తెలుగు 10 – దశావతారం’ పేరుతో మొదలైన ఈ సీజన్.. బిగ్‌బాస్ పదేళ్ల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ ప్రత్యేకంగా సాగింది.
ఇక ‘బిగ్‌బాస్’ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున తన స్టైలిష్ ఎంట్రీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన కుమారుడు అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమాలోని సాంగ్‌తో నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీతో గ్రాండ్ లాంచ్ వేడుక మరింత సందడిగా మారింది. 10వ సీజన్ కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. కొత్త కంటెస్టెంట్లు, సరికొత్త సవాళ్లు, గేమ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!