

బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌పై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. ప్రారంభ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున్ కొంతమంది కంటెస్టెంట్లకు సీక్రెట్ టాస్కులు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి ఓ తాత్కాలిక జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అమన్, ఝాన్సీ, ముఖేష్ గౌడ, దేబ్జానీ, రోహిత్, వర్షిణి, కృష్ణుడు, శాలిని, టెంపర్ వంశీ, అదితి ఈశ్వరన్, చరణ్, నరేష్ జబర్దస్త్, సృష్టి, సుధీర్ రెడ్డి, రామ్ ప్రసాద్, చైత్ర రాయ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక గ్రాండ్ లాంచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషల బిగ్‌బాస్ హోస్టులు వర్చువల్‌గా ఒకే వేదికపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ క్రాస్ఓవర్‌తో లాంచ్ మరింత ఆసక్తికరంగా మారింది. అలాగే నవదీప్, బిందు మాధవి గ్రాండ్ లాంచ్‌కు హాజరైనట్లు టాక్ ఉండగా, అభిజీత్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. సీక్రెట్ టాస్కులు, వివిధ భాషల హోస్టుల కలయిక, స్టార్ గెస్ట్‌ల రాకతో బిగ్‌బాస్ తెలుగు 10పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!