12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

Writer: Chandrika 10:43 AM, 12 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వారంలోనే ఊహించని డబుల్ ఎలిమినేషన్‌తో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో చరణ్ బయటకు వెళ్లగా.. తాజాగా రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో చైత్ర రాయ్ కూడా హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఎపిసోడ్ ప్రారంభంలో హౌస్‌మేట్స్ మద్దతుతో రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్ నుంచి సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మరోవైపు త్రిగుణ్ తన మైండ్ గేమ్స్ కొనసాగిస్తూ అమన్ మసూద్‌తో రోహిత్ గురించి చర్చించాడు. అగ్నిపరీక్షలో రోహిత్ తనపై అరవడం వల్లే అతనికి హైలైట్ అయ్యే అవకాశం వచ్చిందంటూ అమన్‌కు చెప్పాడు. ఇకపై ఇంట్లో జరిగే ప్రతి ఆట కీలకమని, టీమ్‌లు ఉండవని, ప్రతి ఒక్కరూ తమ ఆటను తామే ఆడాలని బిగ్ బాస్ స్పష్టం చేశారు.

హౌస్‌మేట్‌గా మారేందుకు ‘ఈజీ టాస్క్’, ‘హార్డ్ టాస్క్’ అనే రెండు మార్గాలను బిగ్ బాస్ ఇచ్చారు. సుధీర్, వర్షిణి హార్డ్ టాస్క్‌ను ఎంచుకోగా.. మిగిలిన వారు ఈజీ టాస్క్‌ వైపు వెళ్లారు. ఇప్పటికే హై రిస్క్ జోన్‌లో ఉన్న చైత్ర రాయ్‌కు మాత్రం టాస్క్‌లో పాల్గొనే అవకాశం లభించలేదు. అనంతరం ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మరోవైపు దేబ్జానీ భావోద్వేగానికి గురికావడంతో రోహిత్, షాలిని ఆమెను ఓదార్చారు. త్రిగుణ్ ప్రతి విషయంలోనూ సలహాలు ఇవ్వడంపై ముఖేష్ గౌడ, సుధీర్, ఝాన్సీ అసహనం వ్యక్తం చేశారు. గిన్నెలు కడిగే విషయంలో రోహిత్‌తో త్రిగుణ్ మరోసారి వాగ్వాదానికి దిగాడు. ‘రన్ రాజా రన్’ టాస్క్‌లోనూ అతని నిర్ణయాలు చర్చకు దారితీశాయి. ఈ టాస్క్‌లో రామ్ ప్రసాద్ విజేతగా నిలిచాడు. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ హౌస్‌లో టెన్షన్ మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

బిగ్ బాస్ తెలుగు 10 డే 5: చైత్ర రాయ్ రెండో మిడ్ వీక్ ఎలిమినేషన్..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!

బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఇదంతా బిగ్‌బాస్ మాస్టర్ ప్లానేనా?

బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఇదంతా బిగ్‌బాస్ మాస్టర్ ప్లానేనా?

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ 10చైత్ర రాయ్చైత్ర ఎలిమినేషన్త్రిగుణ్రోహిత్రామ్ ప్రసాద్డబుల్ ఎలిమినేషన్రన్ రాజా రన్తెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
క్రీడలు

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..
జనరల్

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..
రాజకీయాలు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...
జనరల్

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...
జనరల్

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?
గాసిప్స్

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?
గాసిప్స్

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!