

వీకెండ్ వచ్చిందంటే ‘బిగ్ బాస్ తెలుగు 10’ హౌస్‌లో సందడి మొదలవుతుంది. హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించడంతో పాటు.. వారం రోజులుగా జరిగిన పరిణామాలపై చర్చిస్తారు. ఈ క్రమంలో తొలి వారానికి సంబంధించిన ఆదివారం ఎపిసోడ్‌లో దేబ్జానీ, ముకేశ్ మధ్య జరిగిన ‘కళ్ల’ కహానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి.
‘మీ మనసుకు ఎవరు దగ్గరయ్యారు? ఎవరు దూరమయ్యారు?’ అని నాగార్జున అడగగా.. రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేశ్, ముకేశ్ పేర్లను కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఆ సమయంలో వాతావరణం సీరియస్‌గా ఉండటంతో ముకేశ్ కళ్లను నాగార్జున ప్రశంసించగా.. హౌస్‌లో నవ్వులు పూశాయి. అయితే దేబ్జానీ కూడా తనకు ముకేశ్ కళ్లు నచ్చాయని చెప్పడంతో నాగ్ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ముకేశ్ అంటే తనకు వచ్చినప్పటి నుంచి ఇష్టమని, కానీ చెప్పలేకపోతున్నానని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ ఇటు, అటు ‘పులిహోర’ కలుపుతున్నాడని, తన దగ్గరకు మాత్రం రావడం లేదని సరదాగా ఫిర్యాదు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య బంధంపై ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!