

ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రావి, వేప మొక్కలను నాటారు. అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపుతో పాటు అటవీ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
అనంతరం ఏనుగుల సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. అడవి ఏనుగుల సంచారాన్ని ఎలా పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని ట్రాకర్లను అడిగి తెలుసుకున్నారు. మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగుల ఆరోగ్యం, సంరక్షణ, ఆహార విధానంపై వివరాలు తెలుసుకుని.. వాటికి రాగి, స్వీట్ కార్న్, చెరకు, బెల్లం తినిపించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!