

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొలి వారంలోనే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటి వారంలోనే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. చరణ్, చైత్ర ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్ జోన్‌లో ఉన్నారు. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున మాత్రం ఎప్పటిలా కాకుండా సీరియస్‌గా హౌస్‌మేట్స్‌కు క్లాస్ తీసుకున్నారు.
చరణ్, చైత్ర సీక్రెట్ రూమ్‌లో ఉన్నారనే అనుమానాలకు లైవ్ కాల్ ద్వారా నాగార్జున చెక్ పెట్టారు. అనంతరం టాస్కుల్లో రాణించిన రోహిత్ నాయుడు, ఆటో రాంప్రసాద్, టెంపర్ వంశీలకు సర్‌ప్రైజ్ ఇచ్చినప్పటికీ.. రోహిత్ గతంలో ఇతరులు ఉపయోగించిన గ్లాసులు కడగనని చెప్పడంపై నాగ్ తీవ్రంగా స్పందించారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఏ పని చిన్నది కాదని చెబుతూ స్వయంగా గ్లాసులు కడిగి చూపించారు. మరోవైపు రోహిత్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన త్రిగుణ్‌ను మందలించి, భారీ టైర్‌ను పట్టుకుని గార్డెన్‌లో తిరిగేలా పనిష్మెంట్ విధించారు. ఇకపై నిర్లక్ష్యం, అహంకారం ప్రదర్శిస్తే ఎలాంటి సెకండ్ ఛాన్స్ ఉండదని మిగిలిన కంటెస్టెంట్లను నాగార్జున హెచ్చరించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!