

‘బిగ్ బాస్ తెలుగు 10’ సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే వరుస ట్విస్టులతో ఆసక్తికరంగా మారుతోంది. ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో మొదలైన ఈ సీజన్‌లో సాధారణ సీజన్లకు భిన్నంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి వారం పూర్తికాకముందే చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్‌ను వీడటం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వారాంతపు ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ లేకుండానే ముగింపు పలకనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు మిడ్ వీక్‌లోనే ఎలిమినేట్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సీజన్‌లో కంటెస్టెంట్లను నేరుగా హౌజ్‌మేట్స్‌గా ప్రకటించకుండా.. టాస్కులు, పరీక్షల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఆ హోదా కల్పిస్తున్నారు. ఇప్పటికే రోహిత్ నాయుడు, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్ హౌజ్‌మేట్స్‌గా ఎంపిక కాగా.. తాజాగా హీరో త్రిగుణ్ నాలుగో హౌజ్‌మేట్‌గా, కామనర్ శాలినీ ఐదో హౌజ్‌మేట్‌గా నిలిచారు. అనంతరం సీరియల్ నటి దేబ్జానీ మోదక్ ఆరో హౌజ్‌మేట్‌గా ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఆరుగురు హౌజ్‌మేట్స్‌గా సేవ్ కాగా, మిగిలిన ఎనిమిది మంది హై రిస్క్‌లో ఉన్నారు. వర్షిణి సౌందరరాజన్, సుధీర్ రెడ్డి, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, నటుడు కృష్ణుడు, ముఖేష్ గౌడ, కామనర్ అమన్ మసూద్, సింగర్ ఝాన్సీపై వచ్చే వారం ఆటతీరు కీలకంగా మారనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!