

బిగ్‌బాస్ తెలుగు 10 తొలి వీకెండ్ ఎపిసోడ్ హౌస్‌లో జరిగిన పలు వివాదాలపై నాగార్జున స్పందించడంతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రా రాయ్ సీక్రెట్ రూమ్‌లో ఉన్నారనే అనుమానాలకు నాగార్జున క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ తమ తమ ఇళ్లలోనే ఉన్నట్లు వీడియో కాల్ ద్వారా హౌస్‌మేట్స్‌కు చూపించారు. అయినప్పటికీ బయట ప్రేక్షకుల్లో మాత్రం దీనిపై చర్చ కొనసాగుతోంది.
రోహిత్ ఇతరులు ఉపయోగించిన గ్లాసులు కడగడానికి నిరాకరించిన అంశంపై నాగార్జున స్పందించారు. బిగ్‌బాస్ ఇంట్లో చిన్న పని, పెద్ద పని అనే తేడా ఉండకూడదని, ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేయాల్సిందేనని సూచించారు. త్రిగుణ్ రోహిత్‌పై ఉపయోగించిన అభ్యంతరకర పదాలపై నాగార్జున తీవ్రంగా మందలించి, క్షమాపణ చెప్పించారు. అనంతరం గార్డెన్‌లో టైర్ మోస్తూ నడవాలని శిక్ష విధించారు. ఇతరుల విషయాల్లో తరచూ జోక్యం చేసుకుంటున్న షాలినీకి కూడా రోజంతా సైలెంట్‌గా ఉండే శిక్ష ఇచ్చారు. మరోవైపు జోక్స్ విషయంలో రాం ప్రసాద్‌ను హెచ్చరించారు. ఆడియెన్స్ ఓట్లతో త్రిగుణ్, షాలినీ, దేబ్జానీ హౌస్‌మేట్స్‌గా మారినట్లు ప్రకటించి వారిని నాగార్జున అభినందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!