
జనరల్

చైనాలో జరిగిన ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. ఫైనల్‌లో భారత్ 1-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో ఏకైక గోల్‌ను భారత క్రీడాకారిణి సానిక చంద్రకాంత్ మనే 17వ నిమిషంలో నమోదు చేసింది. దీంతో ఆసియా కప్ టైటిల్‌ను భారత జట్టు వరుసగా మూడోసారి గెలుచుకున్న ఘనత సాధించింది.
2023లో దక్షిణ కొరియాను ఓడించి తొలి టైటిల్ సాధించిన భారత్.. 2024లో చైనాను ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. తాజాగా మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలవడంతో జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ టైటిల్ సాధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందిలో ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!