

తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ పదో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ‘అగ్నిపరీక్ష’ పేరుతో సెలెక్షన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు పాల్గొంటున్నారు. పలు దశల్లో అభ్యర్థులను వడపోసి చివరకు సుమారు 15 మందిని ఫైనల్ దశకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 55 మంది ఎలిమినేట్ కాగా.. వారిలో ఉప్పల్ బాలు కూడా ఉన్నాడు. తనకు అన్యాయం జరిగిందంటూ నవదీప్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ‘అగ్నిపరీక్ష’లో పాల్గొన్న రన్నింగ్ రాజాతో యాంకర్ శ్రీముఖికి సంబంధించిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్‌లో అవకాశం కోసం కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి వచ్చిన రన్నింగ్ రాజా.. ఓ టాస్క్‌లో భాగంగా శ్రీముఖిని ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె మేకప్, హావభావాలను అనుకరిస్తూ చూపించాడు. అనంతరం శ్రీముఖి దగ్గరకు వెళ్లడంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, తనను తాకితే చెంప పగలగొడతానంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కొందరు నెటిజన్లు శ్రీముఖి తీరును విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని షోలకు పిలిచి అవమానించకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదంతా టాస్క్‌లో భాగమే అయితే దానిని అదే కోణంలో చూడాలని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభను మాత్రం హేళన చేయకూడదని మరికొందరు సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!