28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

Writer: Chandrika 06:49 PM, 28 ఆగస్టు, 2026
సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

సికింద్రాబాద్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో సమగ్ర ట్రాఫిక్‌ అంచనా అధ్యయనాలు చేపట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ ఐఐటీ-హైదరాబాద్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం, ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడం, బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానాన్ని మెరుగుపరచడం ఈ అధ్యయనాల ప్రధాన లక్ష్యం. వాహనాలు, పాదచారుల రాకపోకలు, ట్రాఫిక్‌ సర్క్యులేషన్‌, పార్కింగ్‌, ప్రయాణికుల ఎక్కింపు-దింపింపు ఏర్పాట్లు, జంక్షన్లు, సిగ్నళ్లు, ట్రాఫిక్‌ అవరోధాలు, స్టేషన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ వంటి అంశాలను అధ్యయనం చేయనున్నారు.

డ్రోన్‌ నిఘా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారిత సీసీటీవీ విశ్లేషణ, క్షేత్రస్థాయి సర్వేలు, ట్రాఫిక్‌ సిమ్యులేషన్లను ఉపయోగించి డేటా ఆధారిత పరిష్కారాలను రూపొందించనున్నారు. ఇవి ప్రయాణికుల భద్రత, అందుబాటుదనం, స్టేషన్‌ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి. సికింద్రాబాద్‌ డివిజన్‌ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, ఆర్పీఎఫ్‌, ఆపరేటింగ్‌ విభాగాలు, ఇతర భాగస్వాముల సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుత ట్రాఫిక్‌ సమస్యలకు డేటా ఆధారిత పరిష్కారాలను అందించడంలో ఈ అధ్యయనం కీలకమని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణన్‌ తెలిపారు. భవిష్యత్‌లో ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ ఇలాంటి పరిష్కారాలను అమలు చేసే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని ఆధునిక సాంకేతికతతో సమర్థంగా నిర్వహించేందుకు ఐఐటీ-హైదరాబాద్‌తో కలిసి చేస్తున్న ఈ కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ట్యాగ్లు
దక్షిణ మధ్య రైల్వేసికింద్రాబాద్‌ డివిజన్‌ఐఐటీ హైదరాబాద్‌సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లింగంపల్లి రైల్వే స్టేషన్‌ట్రాఫిక్‌ అధ్యయనంరైల్వే మౌలిక సదుపాయాలుట్రాఫిక్‌ నిర్వహణఏఐ సాంకేతికతప్రయాణికుల భద్రత

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...
జనరల్

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..
జనరల్

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు
షోస్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు
జనరల్

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!
సినిమాలు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?
జనరల్

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...
జనరల్

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..
బిజినెస్

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!