28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

Writer: Chandrika 05:43 PM, 28 ఆగస్టు, 2026
అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అల్యూమినియం ఉత్పత్తి వ్యాపారంలోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అల్యూమినియం తయారీకి కీలకమైన ముడి పదార్థం బాక్సైట్‌. ఒడిశాలోని కర్లాపట్‌ బాక్సైట్‌ బ్లాక్‌ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్‌ రూ.5 లక్షలతో టెండర్‌ పత్రాలను కొనుగోలు చేసింది. అయితే ఈ బ్లాక్‌ను వేదాంత అల్యూమినియం అనుబంధ సంస్థ బాల్కో దక్కించుకుంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రెండు బొగ్గు గనులను వేలం ద్వారా దక్కించుకున్న రిలయన్స్‌.. అక్కడ కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో బొగ్గును సింథసిస్‌ గ్యాస్‌గా మార్చి విద్యుత్‌ ఉత్పత్తికి లేదా పారిశ్రామిక ఇంధనంగా వినియోగించవచ్చు. ప్రతిపాదిత ప్రాజెక్టు నుంచి లభించే గ్యాస్‌ను అల్యూమినియం సహా ఇతర లోహాల ఉత్పత్తికి ఉపయోగించుకునే అవకాశాలను రిలయన్స్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ ఇప్పటికే అల్యూమినియం రంగంలోకి అడుగుపెట్టింది. యూఏఈకి చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో ఒడిశాలో ఏడాదికి 20 లక్షల టన్నుల సామర్థ్యంతో అల్యూమినియం ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ జూన్‌లో ప్రకటించింది. ఇందుకోసం సుమారు 1,150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీంతో అదానీ గ్రూప్‌కు పోటీగా రిలయన్స్‌ కూడా అల్యూమినియం రంగంలోకి వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ముకేశ్‌ అంబానీఅల్యూమినియం వ్యాపారంఅల్యూమినియం ఉత్పత్తిఒడిశా బాక్సైట్‌కర్లాపట్‌ బాక్సైట్‌ గనిఅదానీ గ్రూప్‌బాల్కోకోల్‌ గ్యాసిఫికేషన్‌భారత లోహ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...
జనరల్

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..
జనరల్

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు
జనరల్

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!
సినిమాలు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?
జనరల్

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...
జనరల్

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..
బిజినెస్

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!