

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. రాంచీలోని ఓ సామాన్య కుటుంబం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన క్రీడాకారుడిగా ధోనీ ఎదిగారని ప్రశంసించారు. ఆయన ప్రస్థానం పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.
ధోనీ సాధించిన విజయాలు కేవలం ట్రోఫీలకే పరిమితం కాలేదని జగన్ అన్నారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుండి నడిపించారని, ఒత్తిడిని తనపై వేసుకుంటూ ప్రశాంతంగా జట్టుకు దిశానిర్దేశం చేశారని కొనియాడారు. తన ఆటతీరుతో పాటు నాయకత్వ పటిమ ద్వారా భావితరాలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. ధోనీ విజయాలు, ఆయన అందించిన స్ఫూర్తి క్రికెట్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని చెబుతూ, కొత్త బాధ్యతల్లో మరిన్ని విజయాలు, సంతోషాలు అందుకోవాలని జగన్ ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!