

నాగార్జునసాగర్ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలని ఆరోపించారు. తెలంగాణకు కేటాయించిన నీటి వాటా నుంచి ఒక్క చుక్కను కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడబోదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్ చేసిన వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తోందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. క్రమశిక్షణ విషయంలో అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని, కొత్త పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని అంశాలను పరిశీలిస్తారని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిలిచిపోవడానికి కేంద్రానికి రాసిన లేఖలే కారణమని పేర్కొన్నారు. మరోవైపు, నాగార్జునసాగర్ సమీపంలో ఏపీ నిర్మిస్తున్న సొరంగం అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై ఆరా తీయగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కు రాసిన లేఖల వివరాలను మంత్రి ఆయనకు వివరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!