

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షక సేన పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నల్ల మాస శ్రీకాంత్ గౌడ్ ఈ సమావేశానికి హాజరై తన ప్రాధాన్యతలను వివరించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ యువత కష్టాలు తనకు తెలుసని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే వారి సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపిస్తానని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యేలా, పట్టభద్రులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాడుతానన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడంలో పట్టభద్రుల పాత్ర కీలకమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఆలోచించి వినియోగించుకోవాలని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!