

నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించి తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తాలని సూచించారు.
గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలోని అవినీతి, అక్రమాలు, అరాచకాలపై అసెంబ్లీలో చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన అసెంబ్లీని వదిలేసి బయట మాక్ అసెంబ్లీ నిర్వహించడం రాజకీయ డ్రామా అని విమర్శించారు.
గత పదేళ్ల పాలనపై సమాధానం చెప్పాల్సిన సమయంలో మాక్ అసెంబ్లీ పేరుతో కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని మల్లు రవి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా బయట కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బీఆర్ఎస్ నేతలు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!