12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Pooja 04:26 PM, 12 సెప్టెంబర్, 2026
గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్‌తో పాటు జీహెచ్ఎంసీ, సీహెచ్ఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు.

గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన గత సంప్రదాయాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్వాహకుల సమస్యలను తెలుసుకునేందుకే తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్నానన్నారు. మండపాలకు అతిథులను ఆహ్వానించినప్పుడు ఆ వివరాలను స్థానిక పోలీసు కమిషనరేట్‌కు అందించాలని సూచించారు. అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు వేగంగా చర్యలు తీసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయాన్ని పొందాలని సూచించారు.

మండపాల ఏర్పాట్లపై ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణను సమర్థంగా చేపట్టగలరని సీఎం తెలిపారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల్లో గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని, క్రేన్లు ఏర్పాటు చేసేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీసు శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

ట్యాగ్లు
గణేశ్ ఉత్సవాలురేవంత్ రెడ్డిహైదరాబాద్ వార్తలుతెలంగాణ ప్రభుత్వంగణేశ్ ఉత్సవ కమిటీహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?
బిజినెస్

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు
జనరల్

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి
జనరల్

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు
టెక్నాలజీ

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు
సినిమాలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

అసెంబ్లీకి రావడానికి బీఆర్ఎస్‌కు భయమెందుకు? – ఎంపీ మల్లు రవి

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌
జనరల్

డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై జగన్‌ ఫైర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!