
క్రీడలు

కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన పలు ఆరోగ్య సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో అత్యవసర, కీలక వైద్య సేవలకు మరింత మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అలాగే 9 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర మంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అనంతరం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులు, ప్రజారోగ్య సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాలు కీలకంగా నిలవనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!