12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

Writer: Chandrika 06:22 AM, 12 సెప్టెంబర్, 2026
కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

తెలంగాణ అసెంబ్లీలో విద్యపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందాల్సిన కళాశాలలపై అప్పటి ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ జరిపించినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆ నివేదిక ఏమైందో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరా తీసి, మళ్లీ విచారణకు ఆదేశించానని తెలిపారు. అప్పట్లో అనుకూలంగా ఉన్న కళాశాలలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారనే ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని కొనసాగిస్తుందని, అక్రమాలకు పాల్పడే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ బకాయిల్లో రూ.1,410 కోట్లు చెల్లించామని, తమ ప్రభుత్వ బకాయిల్లో రూ.1,465 కోట్లు చెల్లించామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలోనే రూ.612 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం సుమారు రూ.2,400 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. విద్యార్థుల పేర్లతో మోసపూరితంగా రెండుసార్లు రీయింబర్స్‌మెంట్‌ పొందే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యా సంస్కరణల్లో భాగంగా 10,600 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని చెప్పారు.

పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రచారాన్ని సీఎం ఖండించారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను ప్రైవేటీకరించడం పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల విధానం విజయవంతం కావడంతో అదే విధానాన్ని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఏటీసీల కోసం 282 ఎకరాల రెవెన్యూ భూమిని బదిలీ చేశామని, ఒక్కో కేంద్రం నిర్మాణానికి సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్‌ కళాశాలలు వస్తే సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన శిక్షణ, మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

పాలిటెక్నిక్‌ కళాశాలల సిబ్బంది ఉద్యోగ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సిబ్బందిని కొనసాగిస్తామని, విద్యార్థులపై అదనపు ఫీజుల భారం ఉండదని స్పష్టం చేశారు. అవసరమైతే జీవో 97లో సవరణలు చేస్తామని తెలిపారు. విద్యార్థులు, యువత రాజకీయ ప్రయోజనాలకు బలికావద్దని సూచించారు. తమ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా సంస్కరణలు పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నవేనని పేర్కొంటూ, 2029 ఎన్నికల్లో ప్రజలు తమ పాలనను నిర్ణయిస్తారని రేవంత్‌రెడ్డి అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ అసెంబ్లీతెలంగాణ విద్యవిద్యా సంస్కరణలుఫీజు రీయింబర్స్‌మెంట్కేసీఆర్‌బీఆర్‌ఎస్‌కాంగ్రెస్‌పాలిటెక్నిక్‌ కళాశాలలుయంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...
సినిమాలు

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ
సినిమాలు

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..
జనరల్

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..
రాజకీయాలు

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
రాజకీయాలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..
జనరల్

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..
బిజినెస్

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!
జనరల్

శుక్రుడి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం!

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!