
జనరల్

‘కాక్రోచ్ జనతా పార్టీ’ లేదా ‘బొద్దింక జనతా పార్టీ’ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న CJP ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా Gen Z యువతలో ఈ పార్టీకి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ డిజిటల్ ఉద్యమాన్ని పూణేకు చెందిన జర్నలిజం గ్రాడ్యుయేట్, రాజకీయ వ్యూహకర్త అభిజీత్ దీప్కే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆయన అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్‌లో ఉన్నత విద్య పూర్తి చేసి డిజిటల్ రాజకీయ ప్రచారాలపై పరిశోధనలు చేశారు.
ఉద్యోగ సమస్యలు, రాజకీయ వ్యవస్థపై యువతలో పెరుగుతున్న అసంతృప్తిని వ్యంగ్యంగా ప్రతిబింబిస్తూ CJP రూపుదిద్దుకుంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించిన ఈ ఉద్యమం యువత సమస్యలను బలంగా ప్రస్తావిస్తోంది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్, పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలు వంటి అంశాలతో రూపొందించిన మేనిఫెస్టో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!