22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేస్తాం - సీఎం చంద్రబాబు

Writer: Pooja 04:42 PM, 21 నవంబర్, 2026
ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేస్తాం - సీఎం చంద్రబాబు

ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష ఎన్నికల విధానంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అభ్యర్థులు ఇచ్చిన డబ్బులను తీసుకోకుండా, కొందరు ఓటర్లు వాటిని బాలెట్ బాక్సుల్లో వేయడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కరువు, తుపాన్ల వల్ల కలిగే నష్టాలను శాశ్వతంగా అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పిస్తున్నామని, తుపాను బాధితులు, రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రెండు తుపాన్ల సమయంలో నిబద్ధతతో పనిచేసి ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆర్థిక అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

వైసీపీ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల్లో హింస, కుట్రలతో గెలవాలని వైసీపీ ప్రయత్నించిందని, అయితే ప్రజలు ఆ పార్టీకి తగిన సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసమే రాజకీయ పార్టీలకు ముఖ్యమని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కూటమిపై మరింత నమ్మకం వ్యక్తం చేశారని అన్నారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు తిరస్కరించారని, ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. సంబంధిత ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నామని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిని దాటి ప్రవర్తించవద్దని సూచించారు. ఇదే సందర్భంగా షర్మిల వివాహానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను ఆహ్వానించారని, తాను కూడా పెళ్లికి హాజరయ్యానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 1983 వరకు వైఎస్ తనకు మంచి స్నేహితుడని, రాజకీయంగా విభేదించినప్పటికీ తాను ఎప్పుడూ హద్దులు దాటలేదని అన్నారు. కానీ జగన్ తన సొంత చెల్లిపై కూడా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుమున్సిపల్ ఎన్నికలుఎన్నికల సంస్కరణలుపోలవరం ప్రాజెక్టువైసీపీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!