

తమిళనాడు రాజకీయాల్లో కొలత్తూరు అసెంబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌పై వీఎస్ బాబు విజయం సాధించడంతో కొలత్తూరు స్థానం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకోవాలంటే స్టాలిన్ మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయాలని డీఎంకే నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు. దీంతో ఉప ఎన్నికలో స్టాలిన్ బరిలోకి దిగుతారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు, టీవీకే అధినేత విజయ్ ఈ ఉప ఎన్నికలో భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దివంగత ఎమ్మెల్యే వీఎస్ బాబు కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ కేటాయించి, సానుభూతి ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికను ఏకగ్రీవం చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, విజయ్ అనుసరించనున్న ఈ వ్యూహంపై డీఎంకే ఎలా స్పందిస్తుంది? స్టాలిన్ మళ్లీ పోటీకి దిగుతారా? అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!