
రాజకీయాలు

రాజ్యసభ సభ్యుల ఆస్తుల వివరాలు ఆసక్తికర గణాంకాలను వెలుగులోకి తెచ్చాయి. రాజ్యసభలోని 226 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.26,047 కోట్లుగా నమోదైంది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో ఎంపీ సగటు ఆస్తి విలువ రూ.115.25 కోట్లుగా ఉంది. దేశ అత్యున్నత శాసనసభల్లో ఒకటైన రాజ్యసభలో పెద్ద సంఖ్యలో కోటీశ్వర ఎంపీలు ఉండటం విశేషంగా మారింది.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన ఎంపీలు 31 మంది ఉన్నారు. ఇది మొత్తం సభ్యుల్లో దాదాపు 14 శాతానికి సమానం. ఈ ధనిక ఎంపీల జాబితాలో అత్యధికంగా బీజేపీకి చెందిన ఏడుగురు సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు సభ్యులు చోటు దక్కించుకున్నారు. ఈ గణాంకాలు దేశ రాజకీయాల్లో ఆర్థికంగా బలమైన నాయకుల ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!