
జనరల్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ చేపట్టనున్న కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు టీడీపీ నేత అస్మిత్‌రెడ్డి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు.
ఇరుపార్టీల కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా తాడిపత్రిలో భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు లేదా ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!