

ఆంధ్రప్రదేశ్‌లో కీలక ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని అక్టోబర్ 3 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత అధికారుల బదిలీలకు బ్రేక్ పడనుంది.
2026 జూలై 1ను అర్హత తేదీగా నిర్ణయించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వాటి పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ నేపథ్యంలో బదిలీల నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. దీంతో ఎన్నికల జాబితా సవరణతో సంబంధం ఉన్న కీలక అధికారులు అక్టోబర్ 3 వరకు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!