

తమిళనాడు శాసనసభలో భాషాభిమానం, సాంస్కృతిక ఆత్మగౌరవానికి రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను మొదట ఆలపించడం తప్పనిసరి చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
‘తమిళ్ తాయ్ వాళ్తు’కు 1891లో రచయిత, తమిళ పండితుడు పి. సుందరం పిళ్లై రచించిన మనోన్మణియం నాటకంతో చారిత్రక అనుబంధం ఉంది. 1970లో తమిళనాడు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో ఈ గీతాన్ని ఆలపించాలని ఆదేశించింది. 2021 డిసెంబరులో దీనికి రాష్ట్ర గీతం హోదా లభించింది. ఇటీవల అధికారిక కార్యక్రమాల్లో గీతాలాపన క్రమంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో, రాష్ట్ర గీతాన్ని తొలుత ఆలపించే విధానాన్ని మరింత స్పష్టం చేసేలా విజయ్ ప్రభుత్వం తాజా తీర్మానం తీసుకొచ్చింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!