

విలక్షణమైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ తన 38వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ‘AV38’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మాస్ దర్శకుడు ముత్తయ్య దర్శకత్వం వహించనున్నారు. నేతాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పాండియన్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. చిత్రబృందం విడుదల చేసిన పవర్ఫుల్ అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
‘AV38’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అరుణ్ విజయ్ తెలిపారు. పోస్టర్ కాన్సెప్ట్‌లో కత్తి, త్రిశూలం పట్టుకున్న అమ్మవారి రౌద్రరూపాన్ని చూపించారు. భక్తి అంశాలతో పాటు పక్కా మాస్ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ లుక్ అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. అరుణ్ విజయ్, ముత్తయ్య కాంబినేషన్లో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!