

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తమ దాడులతో ఆ దేశ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని పదేపదే చెబుతున్నప్పటికీ.. పశ్చిమాసియాలో కీలకమైన అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బహ్రెయిన్‌లోని నేవల్ సపోర్ట్ యాక్టివిటీ (NSA) స్థావరానికి ఇరాన్ దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్లు అమెరికా నేవీ తాత్కాలిక కార్యదర్శి హంగ్ కావో స్వయంగా అంగీకరించారు. ఈ స్థావరం యూఎస్ నేవల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్, అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్‌కు ప్రధాన కార్యాలయంగా వ్యవహరిస్తోంది.
బహ్రెయిన్ స్థావరానికి జరిగిన నష్టం నేపథ్యంలో అక్కడి భవిష్యత్ కార్యకలాపాలపై అమెరికా నేవీ ప్రత్యేకంగా సమీక్షిస్తోంది. స్థావరాన్ని పునరుద్ధరించి మళ్లీ వినియోగించాలా, లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలా అనే అంశాన్ని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తున్నట్లు హంగ్ కావో తెలిపారు. పశ్చిమాసియాలో అమెరికా నేవీ కార్యకలాపాలకు ఈ స్థావరం ఎన్నో ఏళ్లుగా కీలక కేంద్రంగా ఉంది. తాజా దాడులతో అక్కడి మౌలిక వసతులకు జరిగిన నష్టం, కార్యకలాపాలను సాధారణ స్థాయికి ఎప్పుడు తీసుకురాగలమనే అనిశ్చితి అమెరికా సైనిక వ్యూహంపై ప్రభావం చూపే అంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!