12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

Writer: Chandrika 11:04 AM, 12 సెప్టెంబర్, 2026
జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

పురుషుల జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మలేసియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్ అన్మోల్ ఎక్కా మరోసారి అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడగా, 12వ నిమిషంలో గోల్ అవకాశం తృటిలో చేజారింది. 16వ నిమిషంలో అన్మోల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం మలేసియాకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత గోల్‌కీపర్ వివేక్ లాక్రా అద్భుతమైన డైవ్‌తో అడ్డుకున్నాడు. మూడో క్వార్టర్‌లో ప్రభ్‌దీప్ సింగ్ ఎల్లో కార్డుతో బయటకు వెళ్లడంతో భారత్ 10 మందితో ఆడినా, మలేసియా దాడులను సమర్థంగా నిలువరించింది.

ఆఖరి క్వార్టర్‌లో సుఖ్వీందర్ సింగ్ 51వ నిమిషంలో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. రెండు నిమిషాల తర్వాత మలేసియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించినప్పటికీ, వివేక్ లాక్రా మరోసారి అడ్డుకుని భారత్ ఆధిక్యాన్ని కాపాడాడు. 54వ నిమిషంలో అన్మోల్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌ను 3-0 ఆధిక్యంలో నిలిపాడు. మ్యాచ్ ముగియడానికి 24 సెకన్ల ముందు మలేసియా తరఫున రాహుల్ గోల్ చేసినా, భారత్ 3-1తో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. కొరియా-పాకిస్థాన్ మధ్య జరిగే మరో సెమీఫైనల్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

ఇషాన్‌ పంచ్‌కు వైభవ్‌ అదిరే రియాక్షన్‌

ఇషాన్‌ పంచ్‌కు వైభవ్‌ అదిరే రియాక్షన్‌

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

ట్యాగ్లు
జూనియర్ ఆసియాకప్ హాకీభారత్ హాకీభారత జూనియర్ హాకీపురుషుల జూనియర్ ఆసియాకప్భారత్ వర్సెస్ మలేసియాఅన్మోల్ ఎక్కావివేక్ లాక్రాసుఖ్వీందర్ సింగ్హాకీ టోర్నమెంట్భారత హాకీ జట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్
క్రీడలు

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు
రాజకీయాలు

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...
జనరల్

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
క్రీడలు

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..
జనరల్

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..
రాజకీయాలు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...
జనరల్

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!