

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న రాకా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే సినిమాలో భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులు ఉండటంతో చిత్రీకరణ షెడ్యూల్‌లో కొంత ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో 2027 క్రిస్మస్ విడుదల రేసు నుంచి రాకా తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2028 రిపబ్లిక్ డే లేదా సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులకు ఎక్కువ సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాతే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!