

తన తల్లిదండ్రులు రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ మధ్య ఉన్న అనుబంధంపై తాను చేసిన వ్యాఖ్యలను విమర్శించిన బీజేపీ నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గట్టిగా బదులిచ్చారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ మద్దతుదారుల హృదయాలు ద్వేషంతో నిండిపోయాయని, అందుకే వారు ప్రేమను అనుభూతి చెందలేకపోతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఎక్స్ వేదికగా పార్వతీదేవి శివుడి ఒడిలో కూర్చున్న ఆలయ శిల్పం ఫొటోను ఆయన పంచుకున్నారు.
సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సోనియాగాంధీ జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఆవిష్కరణ సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, భోజనం చేసే సమయంలో నాన్న(రాజీవ్ గాంధీ), అమ్మ (సోనియా) కలివిడిగా, అన్యోన్యంగా ఉండేవారని, అది చాలా సాధారణ విషయంగా భావించేవాడినని తెలిపారు. దీనిపైౖ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. తన తల్లి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజున కూడా రాహుల్ ఆమెను ఇబ్బందికర పరిస్థితికి గురి చేశారని ఎద్దేవా చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!