
జనరల్

వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుగ్గమఠం భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పళ్లి ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు సూచించిన న్యాయపరమైన మార్గాన్నే అనుసరించాలని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పు ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేవాదాయ, ధర్మాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఈ దశలో అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆయనకు ఊరట లభించలేదు. బుగ్గమఠం భూముల వివాదంపై తదుపరి విచారణ సంబంధిత ట్రైబ్యునల్ పరిధిలో కొనసాగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!