

పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. పార్లమెంట్ అప్రజాస్వామికంగా నడుస్తోందని ఆమె విమర్శించారు. విద్యార్థుల శాంతియుత నిరసనలపై పోలీసుల చర్యలను ఖండించిన ఆమె, రోడ్లపై విద్యార్థులతో ఎలా వ్యవహరిస్తున్నారో, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలతో కూడా కేంద్రం అదే విధంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు మద్దతు తెలిపినందుకు తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులపై పోలీసు చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. విద్యార్థులపై జరిగిన చర్యలకు నిరసనగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!