

బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ 10వ సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానున్న ఈ సీజన్‌కు నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానున్న ఈ షో జియో హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. పదో సీజన్ కావడంతో ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో సర్‌ప్రైజ్‌లు, డ్రామా, టాస్క్‌లు మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు మేకర్స్ ప్రచారం చేస్తున్నారు.
ఇక కంటెస్టెంట్ల ఎంపికపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక పూర్తి జాబితా విడుదలకు ముందే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. వీటిలో వర్షిణి సౌందరాజన్, కృష్ణుడు, టెంపర్ వంశీ, ముఖేష్ గౌడ, చైత్ర రాయ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నరేష్, అదిత్ ఈశ్వరన్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కొందరు కామనర్లు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ పేర్లలో ఎవరు తుది కంటెస్టెంట్లు అనేది గ్రాండ్ ప్రీమియర్‌లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!