

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన తండ్రి, ప్రొఫెసర్ రమేశ్ తెందుల్కర్ జ్ఞాపకార్థం కీలక నిర్ణయం తీసుకున్నారు. యువ వైద్యులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఎండీ పూర్తి చేస్తున్న ఒక విద్యార్థికి ఆర్థిక సహాయం అందించే ఫెలోషిప్‌ను ప్రకటించారు. సచిన్ తెందుల్కర్ ఫౌండేషన్, ఇంగా హెల్త్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
శ్రీనగర్‌లో క్లెఫ్ట్, క్రానియోఫేషియల్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ పొందేందుకు ఏటా ఒక ఎండీ విద్యార్థిని ఎంపిక చేయనున్నారు. తన తండ్రి తనలో క్రికెట్ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని చూశారని, తాను ఏం కావాలో స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇచ్చారని సచిన్ గుర్తుచేసుకున్నారు. విద్యే అవకాశాలను సృష్టిస్తుందని తన తండ్రి నమ్మేవారని, ఆ ఆలోచనను ఇతరులకు ఉపయోగపడేలా కొనసాగించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!