

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద 22A నిషేధిత జాబితా బాధితులకు మద్దతుగా బీజేపీ నిర్వహించిన దీక్షలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేదలు, రైతుల భూములను 22A జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కుత్బుల్లాపూర్, మహేంద్రహిల్స్, బహదూర్‌గూడ తదితర ప్రాంతాల్లో భూములు, ఇళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. పేదల ఇళ్లను కూల్చే చర్యలను వ్యతిరేకిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
22A నిషేధిత జాబితా నుంచి పేదలు, రైతుల భూములు, ఇళ్లను తొలగించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తే భవిష్యత్తులో వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై పలు ఆరోపణలు చేసిన ఆయన.. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. భూభారతి, 22A అంశంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు బీజేపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!