

సీఎం రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను రేవంత్‌రెడ్డిని ఎప్పుడూ దూషించలేదని, ఒకట్రెండు అంశాల్లో మాత్రమే అభిప్రాయ భేదాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గాలకు సమానంగా తన నియోజకవర్గానికి కూడా నిధులు వచ్చాయని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడబోనని అన్నారు.
నకిరేకల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభకు తనకు ఆహ్వానం అందిందని, వేలాది మంది కార్యకర్తలతో కలిసి సభకు హాజరవుతానని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేక పోరాటాలు చేశారని, వారికి ఎలాంటి అన్యాయం జరగకూడదని అన్నారు. కార్యకర్తల సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయమేనని, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!