

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం హైపర్‌వాల్ట్, భాగస్వామ్య సంస్థలు దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ సంస్థలకు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టీసీఎస్, హైపర్‌వాల్ట్ ప్రతినిధులు సమావేశమై ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. అధిక సామర్థ్య కంప్యూటింగ్, లిక్విడ్ కూలింగ్, గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్ వంటి ఆధునిక సాంకేతికతలతో క్యాంపస్‌ను తీర్చిదిద్దనున్నారు. ఏఐ, డేటా సెంటర్లతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!