

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’ విడుదలపై నిర్మాత నాగవంశీ స్పష్టత ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. ముందుగా ప్రకటించినట్టుగానే అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. రాబోయే నెల రోజుల్లో వరుస సర్‌ప్రైజ్‌లు ఉంటాయని వెల్లడించారు.
వచ్చే వారం ప్రారంభంలో టీజర్‌ను, ఆ తర్వాత ఫస్ట్ సింగిల్‌ను, చివరి వారంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు నాగవంశీ పేర్కొన్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ చిట్టిబాబు పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్-వెంకటేశ్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!