

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో జరిగిన నియామక ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా, టెట్ అర్హత, సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన అంశాల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ విమర్శించారు.
స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పూర్తిగా పునఃపరిశీలించాలని, డీఎస్సీ నియామకాలపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. రికార్డులు, డిజిటల్ డేటా ధ్వంసమయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ సిట్టింగ్ జడ్జి, సీబీఐతో సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కాగా, డీఎస్సీ నియామకాల్లో అవకతవకల ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఖండించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!